Mamata Banerjee: జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమే: మమతా బెనర్జీ

Ready to go to jail also says Mamata Banerjee
  • కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి
  • లేకపోతే అధికారం నుంచి వైదొలగాలి
  • బీజేపీ అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా
రైతులకు నష్టం చేకూర్చేలా ఉన్న కొత్త వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అధికారం నుంచి వైదొలగాలని అన్నారు. రైతుల ఆందోళనకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.

 రైతుల హక్కులను కాలరాస్తున్న బీజేపీకి కేంద్రంలో అధికారంలో ఉండే హక్కు లేదని అన్నారు. బీజేపీ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని తాను ప్రశ్నిస్తూనే ఉంటానని... జైలుకు వెళ్లడానికి కూడా తాను సిద్ధమేనని చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు టీఆర్ఎస్ సహా పలు పార్టీలు మద్దతు పలికాయి.
Mamata Banerjee
TMC
BJP
Farm Laws

More Telugu News