Rythu Bandhu: డిసెంబరు 27 నుంచి మరో విడత రైతుబంధు... సీఎం కేసీఆర్ ఆదేశాలు
- రెండో విడత రైతుబంధుపై సీఎం కేసీఆర్ సమీక్ష
- జనవరి 7 వరకు రైతుబంధు సాయం
- పది రోజుల్లో పంపిణీ పూర్తికావాలన్న సీఎం
- ప్రతి ఒక్క రైతు లబ్ది పొందేలా చూడాలని స్పష్టీకరణ
- రూ.7,300 కోట్లు విడుదల చేయాలంటూ ఆదేశాలు
తెలంగాణలో రెండో విడత రైతుబంధు సాయానికి సన్నాహాలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులతో ఇవాళ ప్రగతిభవన్ లో సమీక్ష నిర్వహించారు. డిసెంబరు 27 నుంచి జనవరి 7 వరకు రైతుబంధు సాయం అందించనున్నట్టు సీఎం కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతు లబ్ది పొందేలా చూడాలని, రైతుల ఖాతాలోకే నేరుగా డబ్బు జమ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ రెండో విడత రైతుబంధు పంపిణీ కోసం రూ.7,300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
మొదట తక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులకు రైతుబంధు అందజేయాలని, ఆ తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో భూమి కలిగిన రైతులకు రైతుబంధు అందించాలని సూచించారు. ఇదంతా 10 రోజుల్లో ముగియాలని స్పష్టం చేశారు.