Divya Bhatnagar: కరోనా మహమ్మారికి బలైన బుల్లితెర నటి

Television artist Divya Bhatnagar dies of corona
  • హిందీ టీవీ రంగంలో విషాదం
  • కరోనాతో మరణించిన దివ్య భట్నాగర్
  • ఉడాన్, యే రిస్తా క్యా కహా లాతాహై కార్యక్రమాలతో గుర్తింపు
  • గత నెలలో కరోనా బారినపడిన దివ్య
  • న్యుమోనియా ఉండడంతో పరిస్థితి విషమం
ఉత్తరాది టెలివిజన్ రంగంలో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటి దివ్య భట్నాగర్ కరోనా మహమ్మారికి బలైంది. దివ్య వయసు 34 సంవత్సరాలు. ఉడాన్, విష్, యే రిస్తా క్యా కహా లాతాహై, తేరా యార్ యూ మై వంటి టెలివిజన్ కార్యక్రమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. గత నెల చివరి వారంలో దివ్య భట్నాగర్ అస్వస్థతకు గురికావడంతో ఆమెను ముంబయిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

ఆమెకు న్యుమోనియా ఉండడంతో కొన్నిరోజుల్లోనే పరిస్థితి విషమించింది. దాంతో దివ్యను గతవారం ఆమె కుటుంబసభ్యులు మరో ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది. దివ్య మరణంతో ఆమె సహనటులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Divya Bhatnagar
Corona Virus
Death
Television
Mumbai

More Telugu News