sunitha: సింగర్‌ సునీత వివాహ నిశ్చితార్థం.. ఫొటోలు ఇవిగో!

singer sunitha gets engaged

  • రామ్‌ వీరపనేనితో ఈ రోజు ఉదయం సునీత నిశ్చితార్థం 
  • ఇంట్లోనే చాలా నిరాడంబరంగా వేడుక
  • సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు వైరల్

గాయనిగా సినీ పరిశ్రమలో మంచి పేరు సంపాదించుకున్న సునీత త్వరలో మరో వివాహం చేసుకోబోతున్నారని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త  రామ్‌ వీరపనేనితో ఈ రోజు ఉదయం ఆమె నిశ్చితార్థం జరిగింది. ఇంట్లోనే చాలా నిరాడంబరంగా నిశ్చితార్థ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
   
ఈ సందర్భంగా సునీత సిగ్గుపడుతూ దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సునీతకు 19 ఏళ్ల వయసులోనే పెళ్లి కాగా, భర్తతో విభేదాల కారణంగా చాలా ఏళ్లుగా ఆయనకు ఆమె దూరంగా ఉన్నారు. చివరకు విడాకులు తీసుకొని ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. సునీతే తన పిల్లల సంరక్షణ బాధ్యతలు చూసుకుంటున్నారు. కాగా, సునీతకు కాబోయే భర్త రామ్ వీరపనేనిది కూడా ఇది రెండో వివాహ‌మేన‌ని తెలుస్తోంది.  
 
  

sunitha
singer
Tollywood
marriage
  • Loading...

More Telugu News