Solor System: 397 సంవత్సరాల తరువాత... డిసెంబర్ 21న అతి దగ్గరగా రానున్న గురు, శనిగ్రహాలు!

After 397 Years Jupiter and Satrun nears

  • 1623 తరువాత ఖగోళంలో జరగనున్న అద్భుతం
  • దగ్గరకు రానున్న రెండు గ్రహాలు
  • వెల్లడించిన బిర్లా ప్లానిటోరియం

మరో పద్నాలుగు రోజుల్లో అంతరిక్షంలో అద్భుతం జరగనుంది. డిసెంబర్ 21న గురు, శని గ్రహాలు ఒకదానికొకటి అత్యంత దగ్గరికి రానున్నాయి. 397 సంవత్సరాల తరువాత ఈ ఘటన జరుగనుంది. ఇంతకుముందు 1623లో ఈ రెండు గ్రహాలు అత్యంత సమీపానికి వచ్చాయని, ఆ తరువాత ఇప్పుడు మరోసారి అదే జరగనుందని ఎంపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్ దేవీ ప్రసాద్ దువారీ ఓ ప్రకటనలో తెలిపారు.

"ఈ రెండు గ్రహాలు ఒకదానికి ఒకటి దగ్గరగా రావడంతో పాటు భూమికీ దగ్గరకు వస్తాయి. ఈ ప్రక్రియను సంయోగంగా అభివర్ణిస్తారు. ఇక గురు, శని గ్రహాల సంయోగాన్ని గొప్ప సంయోగంగా భావించవచ్చు. ఆ రోజున రెండు గ్రహాలూ మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి. ఆ సమయంలో వీటి మధ్య కేవలం 735 మిలియన్ కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. తదుపరి ఈ రెండు గ్రహాలు మార్చి 15, 2080న దగ్గరకు వస్తాయి" అని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News