Salman Khan: దుబాయ్ రెస్టారెంటులో ప్లేట్లు పగలగొట్టిన సల్మాన్ సోదరి... అసలు కారణం ఇదే!

Salman Khan sister Arpita breaks plates at a Greek Restaurant in Dubai

  • ఇటీవల దుబాయ్ వెళ్లిన సల్మాన్ సోదరి అర్పిత
  • కుటుంబం, మిత్రులతో పర్యటన
  • గ్రీకు రెస్టారెంటులో విందు, వినోదం
  • ప్లేట్లు పగలగొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన వైనం
  • గ్రీకు సంప్రదాయాన్ని అనుసరించిన అర్పిత

కరోనా లాక్ డౌన్ తో నెలల పాటు ఇళ్లకే పరిమితమైన సెలబ్రిటీలు ఆంక్షలు సడలించిన తర్వాత నచ్చిన ప్రదేశానికి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. బాలీవుడ్ కండలరాయుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత కూడా దుబాయ్ వెళ్లింది. కుటుంబ సభ్యులు, మిత్రులతో దుబాయ్ లో సందడి చేసింది. అయితే, స్థానికంగా ఉన్న ఓ గ్రీకు రెస్టారెంటుకు వెళ్లిన అర్పిత అక్కడ ప్లేట్లు పగలగొట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా ఏదైనా రెస్టారెంట్లలో ప్లేట్లు పగలగొడితే అందుకు తగిన జరిమానా ఉంటుంది.

కానీ గ్రీకు రెస్టారెంట్లలో ప్లేట్లు పగలగొట్టడం ఓ సంప్రదాయం. అలా చేస్తే దుష్టశక్తులు దూరంగా వెళ్లిపోతాయన్నది గ్రీకు పురాణాల్లో చెబుతారు. అందుకే గ్రీకు రెస్టారెంట్లతో ప్లేట్లు పగలగొట్టే సంప్రదాయం తప్పనిసరిగా పాటిస్తారు. అర్పిత కూడా అదే చేసింది. టేబుల్ పై అమర్చిన పేట్లను విసిరేస్తూ కొత్త సంప్రదాయాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు,  సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News