Teaminidia: రెండో టీ20: గాయంతో తప్పుకున్న ఆసీస్ సారథి... టాస్ గెలిచిన టీమిండియా

Teamindia won the toss in Sydney clash
  • సిడ్నీలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా
  • బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • ఫించ్ స్థానంలో ఆసీస్ జట్టుకు మాథ్యూ వేడ్ సారథ్యం
  • జడేజాకు విశ్రాంతి
  • చహల్ కు తుదిజట్టులో చోటు
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫామ్ లో ఉన్న కెప్టెన్ ఆరోన్ ఫించ్ గాయంతో వైదొలిగాడు. ఫించ్ స్థానంలో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలి టీ20లో గాయపడిన రవీంద్ర జడేజా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. అతడి స్థానంలో యజువేంద్ర చహల్ తుదిజట్టులోకి వచ్చాడు.

ఆసీస్ జట్టు విషయానికొస్తే... ఫించ్, హేజెల్ వుడ్, స్టార్క్ లకు విశ్రాంతి కల్పించారు. వారి స్థానంలో మార్కస్ స్టొయినిస్, ఆండ్రూ టై, డేనియల్ సామ్స్ వచ్చారు. మూడు టీ20ల సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
Teaminidia
Australia
Toss
2nd T20
Sydney

More Telugu News