Jersey: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కొత్త జెర్సీల వెనుక ఆసక్తికర అంశం!

  • భారత్ తో టీ20 సిరీస్ లో కొత్త జెర్సీల్లో ఆసీస్ ఆటగాళ్లు
  • ఆదివాసీల గుర్తుగా నూతన జెర్సీల రూపకల్పన
  • జెర్సీలపై ఆదివాసీల మూలాల ముద్రణ
Australia cricket team wears new jerseys

భారత్ తో టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కొత్త జెర్సీలు ధరించింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఎక్కువగా పసుపు, ఆలివ్ రంగుల్లో రెండు రకాల జెర్సీలు వినియోగించేది. అయితే, ఈసారి అందుకు భిన్నంగా నల్ల రంగు జెర్సీలు ధరించారు. ఈ జెర్సీల వెనుక చారిత్రక నేపథ్యం ఉంది.

ఆస్ట్రేలియాలో 60 వేల సంవత్సరాల కిందటే ఆదివాసీ నాగరికత రాజ్యమేలింది. ప్రపంచవ్యాప్తంగా వలస సామ్రాజ్యాన్ని విస్తరించిన బ్రిటీషర్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి, అక్కడ వలస కాలనీలు ఏర్పాటు చేసుకుని ఆదివాసీలతో క్రమంగా మమేకమయ్యారు. బ్రిటీషర్లు అక్కడి ఆదివాసీలకు క్రికెట్ ను కూడా పరిచయం చేశారు. ఈ క్రమంలో 1868లో తొలితరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ లో పర్యటించింది. ఆ సమయంలో జట్టులో అత్యధికులు ఆదివాసీలే.

ఈ పర్యటన జరిగి 152 ఏళ్లయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆదివాసీల సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త జెర్సీలకు రూపకల్పన చేసింది. ఈ నల్లరంగు జెర్సీలపై ఆదివాసీల చిహ్నాలు, మూలాలు ముద్రించారు. ఈ జెర్సీలను డిజైన్ చేసింది కూడా ఫియోనా, హెజెన్ అనే ఆదివాసీ మహిళలే.

More Telugu News