Errabelli: ఎంఐఎంతో పాత్తు లేకుండానే మేయర్ పీఠం దక్కించుకుంటాం: మంత్రి ఎర్రబెల్లి

errabelli expresses confidence on mayor post

  • టీఆర్ఎస్-ఎంఐఎం పొత్తుపై ఊహాగానాలు
  • కొట్టి పారేసిన ఎర్రబెల్లి
  • విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం లబ్ధిపొందాయని వ్యాఖ్య

హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యాన్ని ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్ మేయర్ పీఠానికి పది సీట్ల దూరంలో నిలిచింది. దీంతో టీఆర్ఎస్, ఎంఐఎం రెండు పార్టీలు కలిసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు.

వరంగల్ నగర పాలక సంస్థ ట్రాక్టర్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... ఎంఐఎంతో పొత్తు లేకుండానే గ్రేటర్ పీఠం దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ, ఎంఐఎం లబ్ధిపొందాయని ఆయన తెలిపారు.

Errabelli
TRS
MIM
GHMC Elections
  • Loading...

More Telugu News