IYR Krishna Rao: జయము జయము చంద్రన్నకు రూ.84 కోట్లు.. మరి జయహో జగనన్నకు ఎంత?: ఐవైఆర్

iyr krishna rao slams ap govt

  • అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలపై ఐవైఆర్ స్పందన
  • ఈ విషయం కూడా చెబితే బాగుంటుంది
  • రోజూ హైదరాబాద్ ఎడిషన్ల మొదటి పేజీల్లో ఏపీ ప్రభుత్వ ప్రకటనలు

మూడు రోజుల క్రితం  ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ... పోలవరం సందర్శన పేరుతో గత చంద్రబాబు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ‘చంద్రన్న భజన’ చేయడం కోసం టీడీపీ సర్కారు ఏకంగా రూ.83 కోట్లు ఖర్చు పెట్టిందని ఆయన ఆరోపించారు. పోలవరం సందర్శనకు వెళ్లిన మహిళలు చంద్రబాబుపై పాడిన భజన పాట వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు. దీనిపై ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తన అభిప్రాయాన్ని తెలిపారు.

‘జయము జయము చంద్రన్నకు 84 కోట్ల రూపాయలు. అలాగే, జయహో జయహో జగనన్నకు ఎంత ఖర్చవుతుందో కూడా చెబితే బాగుంటుంది. రోజూ రాష్ట్రంలో భాగంగాని హైదరాబాద్ ఎడిషన్ల మొదటి పేజీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హస్తాలు నేస్తాలు వెల్లువల అడ్వర్టైజ్ మెంట్ లతో నిండిపోతున్నాయి’ అని వార్తా పత్రికల్లో వైసీపీ ప్రభుత్వం చేసుకుంటోన్న ప్రచారంపై ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు.

IYR Krishna Rao
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News