Narne Srinivas: నన్ను ఆంధ్రా సెటిలర్లు గెలిపించారు: హైదర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె

Narne Srinivas response after his victory

  • 2010 ఓట్లతో బీజేపీపై గెలిచిన నార్నె
  • కులాలు, మతాలకు అతీతంగా ఓటు వేశారని వ్యాఖ్య
  • సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తాం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదర్ నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నార్నె శ్రీనివాస్ గెలుపొందారు. 2010 ఓట్ల మెజార్జీతో  బీజేపీ అభ్యర్థిపై జయకేతనం ఎగురవేశారు. నార్నె గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస్ మాట్లాడుతూ, తనపై నమ్మకముంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కులాలు, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా తనకు ఓట్లు వేశారని తెలిపారు. ఆంధ్ర సెటిలర్లే తనను గెలిపించారని చెప్పారు. ప్రచార సమయంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారిస్తానని అన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News