Kangana Ranaut: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై హీరోయిన్ కంగన ఆసక్తికర వ్యాఖ్యలు

kangana slams congress

  • ప్రియమైన కాంగ్రెస్ పార్టీ అంటూ ట్వీట్
  • మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు
  • రోజంతా కంగనా కంగనా అంటూ నా నామ జపం చేస్తున్నాయి
  • క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది

జీహెచ్ఎంసీ ఎన్నికల లెక్కింపులో భాగంగా ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉండడం పట్ల హీరోయిన్ కంగన రనౌత్ స్పందించింది. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోందని ఆమె ట్వీట్ చేసింది. జీహెచ్ఎంసీ ఫలితాలపై ఒకరు చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేసింది.

‘ప్రియమైన కాంగ్రెస్ పార్టీ... మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గందరగోళ పరిస్థితులు ఉన్నాయి.. రోజంతా కంగనా కంగనా అంటూ నా నామ జపం చేస్తున్నాయి.. ఇలాగైతే మీకు ఏ లాభం ఉండదు. క్లిష్టమైన నగరాల్లో బీజేపీ ప్రజల హృదయాలను గెలుచుకుంటోంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అని కంగన రనౌత్ పేర్కొంది.

Kangana Ranaut
Congress
BJP
Bollywood
  • Loading...

More Telugu News