India: కరోనా టీకా బుకింగ్‌లో భారత్ అగ్రస్థానం.. 160 కోట్ల కన్ఫర్మ్ డోసేజీల ఆర్డర్

India booked 160 crore corona vaccine doses

  • ప్రపంచ దేశాలకు మించి టీకా డోసులను బుక్ చేసిన భారత్
  • 500 మిలియన్ డోసుల ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా బుకింగ్
  • డ్యూక్ యూనివర్సిటీ గణాంకాల్లో వెల్లడి

ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కరోనా టీకా అరంగేట్రానికి సిద్ధమైన నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం భారత్ సహా పలు దేశాలు చర్యలు చేపట్టాయి. అయితే, ఈ విషయంలో మిగతా దేశాలతో పోలిస్తే భారత్ ముందుంది. కరోనా టీకా బుకింగ్ విషయంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తాజాగా వెల్లడైంది. ఇప్పటి వరకు 160 కోట్ల కన్ఫర్మ్ డోసేజీలను ఆర్డర్ చేసినట్టు డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ‘లాంచ్ అండ్ స్కేల్ స్పీడోమీటర్’ వెల్లడించిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా టీకాను మిగతా దేశాలకంటే ఎక్కువగా భారత్ బుక్ చేసుకున్నట్టు ఆ గణాంకాలు వెల్లడించాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన టీకాను 500 మిలియన్ డోసులను భారత్ బుక్ చేసింది. అమెరికా కూడా దాదాపు ఇంతే స్థాయిలో బుక్ చేసింది. ఆస్ట్రాజెనెకా టీకాపై ఆసక్తి చూపుతున్న యూరప్ దేశాలు కూడా ఈ టీకాను భారీస్థాయిలో బుక్ చేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News