High Court: ఈసీ ఆదేశాలను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు... స్వస్తిక్ గుర్తుతో ఉంటేనే ఓట్లు చెల్లుతాయని స్పష్టీకరణ!

Telangana EC Decission Ruled by Highcourt

  • పెన్నుతో టిక్ పెట్టినా ఓట్లు చెల్లుతాయన్న ఈసీ
  • హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన బీజేపీ
  • బీజేపీకి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు

పెన్నుతో టిక్ పెట్టిన బ్యాలెట్ ఓట్లు కూడా చెల్లుతాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. కేవలం స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ పేపర్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయని, మరే విధమైన పద్ధతుల్లో ఓటేసేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈసీ ఇచ్చిన ఆదేశాలపై కోర్టును ఆశ్రయిస్తూ, బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఉదయం కోర్టు ప్రారంభం కాగానే, ఈ కేసును విచారణకు స్వీకరించిన హైకోర్టు, పెన్నుతో మార్క్ చేస్తే ఓట్లు చెల్లబోవని తేల్చింది. ఈ సమాచారాన్ని వెంటనే కౌంటింగ్ కేంద్రాలకు అందించాలని ఆదేశించింది. ఫలానా పోలింగ్ స్టేషన్ లో స్వస్తిక్ గుర్తు అందుబాటులో లేదని ఈసీ చెప్పలేదని, అక్కడ పెన్నుతో గుర్తు పెట్టేందుకు అనుమతిస్తున్నామని కూడా ప్రకటించలేదని బీజేపీ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. దీంతో ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ధర్మాసనం, తుది ఉత్తర్వులకు లోబడి ఫలితాలు ఉంటాయని పేర్కొంటూ, తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News