KCR: నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం కేసీఆర్

CM KCR attends Nomula Narsimhaiah funerals

  • పాలెం గ్రామంలో నోముల అంత్యక్రియలు
  • నోముల భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి
  • గంటపాటు అక్కడే గడిపిన సీఎం

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు ఇవాళ నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో నిర్వహించారు. ఈ టీఆర్ఎస్ శాసనసభ్యుడి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. నోముల భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నోముల కుటుంబసభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. వారికి ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

నోముల నర్సింహయ్య హైదరాబాదులో మంగళవారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హైదర్ గూడ అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు వైద్యులు నిర్ధారించారు.

నోముల అంత్యక్రియలు పాలెం గ్రామంలోని ఆయన స్వంత వ్యవసాయక్షేత్రంలో నిర్వహించారు. ఈ ఉదయం బేగంపేట నుంచి హెలికాప్టర్ లో పాలెం గ్రామం చేరుకున్న సీఎం కేసీఆర్... నోముల అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు అక్కడే గడిపారు. కొద్దిసేపటి క్రితమే తిరిగి హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది.

  • Error fetching data: Network response was not ok

More Telugu News