Cricket: మూడో వన్డేలో ధాటిగా ఆడిన పాండ్యా, జడేజా.. ఆసీస్ ముందు 303 పరుగుల లక్ష్యం

india score in aus tour

  • 63 పరుగులు చేసిన కోహ్లీ 
  • హార్థిక్ పాండ్యా 92, రవీంద్ర జడేజా 66
  • ఆస్ట్రేలియా బౌలర్లలో ఏసీ అగర్‌కు రెండు వికెట్లు 

ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతోన్న మూడవ వన్డే మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఆశించిన మేరకు రాణించలేదు. అయినప్పటికీ 6, 7 స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన హార్థిక పాండ్యా, రవీంద్ర జడేజా ధాటిగా ఆడడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.

శిఖర్ ధావన్ 16, శుభ్‌మన్ గిల్ 33, కోహ్లీ 63, అయ్యర్ 19, కేఎల్ రాహుల్ 5 పరుగులు చేసి ఔటయ్యారు. చివర్లో హార్థిక్ పాండ్యా (92 పరుగులు), రవీంద్ర జడేజా (62 పరుగులు) కలసి ధాటిగా ఆడడంతోనే భారత్ ఆ మాత్రమైనా పరుగులు చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఏసీ అగర్ రెండు వికెట్లు తీయగా, హజ్లెవూడ్, అబ్బోట్, జంపా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.

మొదటి రెండు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. మొదటి మ్యాచులో 374, రెండో మ్యాచులో 389 పరుగులు చేసి భారత్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. అయితే, ఈ రోజు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఆ స్థాయిలో భారీ స్కోరు చేయలేకపోయింది.

Cricket
India
Team India
Australia
  • Loading...

More Telugu News