Devineni Uma: నిధుల మళ్లింపు నిజం కాదా?: దేవినేని ఉమ

  • కొవిడ్-19 కోసం 900 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్టు లెక్కలు
  • 400 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు
  • కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టింది?
  • శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా?  
devineni uma slams jagan

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద కేంద్రం ఇచ్చిన రూ.600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకుందంటూ ఆంధ్రజ్యోతిలో ఇచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. ప్రస్తుతం సెకండ్‌వేవ్ ను‌ ఎదుర్కొనేందుకు నిధుల కొరత ఉందని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు మందులు, పరికరాలు కొనేందుకు కష్టంగా మారిందని, పీహెచ్‌సీలకూ భారీగా బకాయిలు ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాలను దేవినేని ఉమ ప్రస్తావించారు.

‘కొవిడ్-19 కోసం 900 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్టు లెక్కలు. 400 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు, కరోనా కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం ఉందా? మెరుగైన వైద్యసేవల కోసం ఎన్‌హెచ్ఎం ఇచ్చిన 600 కోట్ల రూపాయలు, మ్యాచింగ్ గ్రాంట్ 400 కోట్ల రూపాయలు ఎక్కడ ఖర్చుపెట్టారు? నిధుల మళ్లింపు నిజంకాదా?’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు.

More Telugu News