Milli Sarkar: చీరకట్టుతో యువతి బ్యాక్ ఫ్లిప్స్... నెట్టింటిని ఆశ్చర్యంలో ముంచెత్తిన వీడియో ఇదిగో!

Lady Backflips in Saree Goes Viral

  • అత్యంత నైపుణ్యంతో విన్యాసాలు
  • మిల్లీ సర్కార్ చేసిన ఫీట్ కు నెటిజన్ల ఫిదా
  • కేంద్ర మంత్రుల ప్రశంసలు

బ్యాక్ ఫ్లిప్స్ (వెనక్కి పిల్లిమొగ్గలు వేయడం) గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా, స్టంట్ ప్రొఫెషనల్స్, జిమ్నాస్ట్ లు దీన్ని చేస్తుంటారని, ఇదేమంత సులువు కాదని, ఏ మాత్రం పట్టు తప్పినా, ల్యాండింగ్ సమయంలో కాలు జారినా, ఎముకలు విరిగేంతటి గాయాలు అవుతాయన్న సంగతి తెలిసే ఉంటుంది. తనలోని అథ్లెటిక్ ను, జిమ్నాస్టిక్ సామర్థ్యాన్ని బయటి ప్రపంచానికి పరిచయం చేయాలని భావించే వారు బ్యాక్ ఫ్లిప్స్ వరుసగా చేస్తూ, వీడియోలను తీసి పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఈ తరహా వీడియోలన్నీ టైట్ గా ఉండే జీన్స్, లేదా వదులుగా ఉండే షార్ట్స్ వేసుకునే చేస్తుండటం ఇంతవరకూ చూశాం.

అయితే, ఓ యువతి, చీరకట్టుకుని అత్యంత నైపుణ్యంతో బ్యాక్ ఫ్లిప్స్ చేయడాన్ని ఎన్నడైనా చూశారా? ఈ వీడియో చూపిస్తుంది. మిల్లీ సర్కార్ అనే యువతి, చీరకట్టుకుని తనలోని జిమ్నాస్ట్ ను చూపుతుండగా తీసిన వీడియో 'ఇండియన్ ఉమెన్ ఆర్ సూపర్ ఉమెన్' అనే క్యాప్షన్ తో తొలుత ట్విట్టర్ లో, ఆపై ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన కేంద్రమంత్రులు కిరణ్ రిజిజు, స్మృతి ఇరానీ తదితరులు ఆమె ప్రతిభను కొనియాడుతూ ట్వీట్ చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News