Road Accident: చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

6 die in accident in chevella

  • మల్కాపూర్‌ గేటు వద్ద ప్రమాదం
  • ఇన్నోవా కారు, బోర్‌వెల్‌ వాహనం ఢీ
  • మరో నలుగురికి తీవ్రగాయాలు
  • బాధితులు హైదరాబాద్ తాడ్‌బండ్ వాసులుగా గుర్తింపు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్‌ గేటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-బీజాపూర్‌ రహదారిపై ఇన్నోవా కారు, బోర్‌వెల్‌ వాహనం ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను హైదరాబాద్ తాడ్‌బండ్ వాసులుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో 10 మంది ఉన్నట్లు తెలిపారు. తాడ్‌బండ్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వెళ్తున్న సమయంలో ఆ ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న బోర్‌వెల్‌ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని వివరించారు. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతుల పేర్లు అసిఫ్‌ఖాన్‌, సానియా, నజియాబేగం, హర్ష, నజియాభాను, హర్షభాను అని చెప్పారు.

Road Accident
Telangana
Ranga Reddy District
  • Loading...

More Telugu News