GHMC Elections: మంత్రి పువ్వాడ కాన్వాయ్‌పై బీజేపీ కార్యకర్తల దాడి.. కారు అద్దాలు ధ్వంసం
- మందకొడిగా జరుగుతున్న జీహెచ్ఎంసీ పోలింగ్
- పలుచోట్ల టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ
- కేపీహెచ్బీ ఫోరం మాల్ వద్ద ఉద్రిక్తత
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా కొనసాగుతోంది. పోలింగ్ ప్రారంభమై దాదాపు ఐదు గంటలు గడుస్తున్నా పలు డివిజన్లలో ఇప్పటికీ 10 శాతం కంటే తక్కువ ఓటింగ్ నమోదైంది. మరోవైపు పలు ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ కార్యక్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
మరోవైపు కేపీహెచ్బీ కాలనీ ఫోరం మాల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ బీజేపీ శ్రేణులు గొడవకు దిగాయి. ఇదే సమయంలో అక్కడకు వచ్చిన మంత్రి పువ్వాడ అజయ్ కారుపై కూడా బీజేపీ శ్రేణులు దాడికి యత్నించాయి. కారు అద్దాలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మంత్రి కారులో డబ్బు తరలిస్తున్నారంటూ ఆందోళన చేశారు. దీంతో, అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బీజేపీ శ్రేణులను చెదరగొట్టారు.