Chandrababu: ముఖ్యమంత్రిని వాడూ, వీడూ అంటారా? చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనన్న చీఫ్ విప్!

Chandrababu Must say Apolosies says Gadikota

  • చంద్రబాబు తీరు దురదృష్టకరం
  • బాధ్యతగల విపక్ష నేత దిగజారి మాట్లాడుతున్నారు
  • ప్రజలు నవ్వుకుంటున్నారన్న గడికోట శ్రీకాంత్ రెడ్డి

కనీస సంస్కారాన్ని మరచి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని వాడు, వీడూ అని చంద్రబాబు సంబోధించిన తీరు అత్యంత దురదృష్టకరమని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఆయన తక్షణం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన, బాధ్యతగల విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దిగజారి మాట్లాడుతుంటే, ఆయన పార్టీ నేతలు మరింతగా బరితెగిస్తున్నారని నిప్పులు చెరిగారు.

 తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు మాటలు వింటున్న రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. విపక్షం అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు.

Chandrababu
Andhra Pradesh
Andhra Pradesh Assembly
Gadikota Srikanth Reddy
  • Loading...

More Telugu News