Narendra Modi: జిగేల్మనిపించే లేజర్ లైటింగ్, లౌడ్ స్పీకర్లలో సంగీతం... ఉత్సాహంగా కాలు కదిపిన ప్రధాని మోదీ!

PM Modi enjoyed laser lighting and fast beat devotional music at Ganga River Ghats

  • వారణాసిలో మోదీ పర్యటన
  • 'దేవ్ దీపావళి మహోత్సవ్' లో పాల్గొన్న మోదీ
  • 15 లక్షల దీపాలతో మెరిసిపోయిన గంగా నదీ ఘాట్లు

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించిన సందర్భంగా 'దేవ్ దీపావళి మహోత్సవ్' వేడుకల్లో పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గంగానది ఘాట్లలో 15 లక్షల దీపాలు వెలిగించారు. విద్యుద్దీపాలంకరణతో గంగానదీ తీరం మెరిసిపోయింది.

కాగా, ఇక్కడ ఏర్పాటు చేసిన లేజర్ లైటింగ్ షోను ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తిగా తిలకించారు. లౌడ్ స్పీకర్లలో 'మహాదేవ శివశంకర శంభో' అంటూ ఫాస్ట్ బీట్ లో భక్తిగీతం వినవస్తుండగా మోదీ ఉత్సాహంగా కాలు కదిపారు. లేజర్ లైటింగ్ ను, సంగీతాన్ని హాయిగా ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్ లో పంచుకున్నారు. కొద్దిసేపట్లోనే వేలల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News