Apple: యాపిల్‌కు ఇటలీలో భారీ జరిమానా వడ్డన

Italys Anti Trust Authority fines Apple
  • 10 మిలియన్ యూరోస్ జరిమానా విధించిన ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ
  • వినియోగదారులకు తప్పుడు సమాచారం ఇచ్చిందన్న అథారిటీ
  • ఫోన్లను వాటర్ రెసిస్టెంట్లుగా తప్పుడు ప్రచారం చేశారని ఆరోపణ
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ సంస్థకు ఉన్న ప్రాచుర్యం, క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సంస్థ తయారు చేసిన ఫోన్లు కానీ, ఇతర ఏ వస్తువులైనా సరే జనాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. కొత్త ప్రాడక్ట్ మార్కెట్లోకి రాబోతోందనే వార్త వెలువడినప్పటి నుంచి వినియోగదారులు ఎదురు చూస్తుంటారు. అలాంటి దిగ్గజ సంస్థ యాపిల్ కు కూడా జరిమానా విధించారు. ఆ సంస్థ తప్పుడు విధానాలను అనుసరించిందంటూ ఇటలీలోని యాంటీ ట్రస్ట్ అథారిటీ 10 మిలియన్ యూరోస్ జరిమానా విధించింది.

పలు మోడళ్ల ఫోన్లపై యాపిల్ తప్పుడు సమాచారం ఇచ్చిందని... వివరాలను ఇవ్వకుండా, వాటర్ రెసిస్టెంట్లుగా ప్రచారం చేసిందని యాంటీ ట్రస్ట్ అథారిటీ తెలిపింది. ద్రవ పదార్థాల వల్ల ఫోన్ దెబ్బతింటే వారంటీ వర్తించదని పేర్కొనడాన్ని తప్పుపట్టింది. నీటిలో పడి దెబ్బతిన్న ఫోన్లకు ఎలాంటి సహకారాన్ని అందించలేదని తెలిపింది. ఇది వినియోగదారులను మోసం చేయడమేనని పేర్కొంది.
Apple
Fine
Italy
Anty Trust Authority

More Telugu News