Hyderabad: ‘డౌన్‌లోడ్ యువర్ ఓటర్ స్లిప్’.. మై జీహెచ్ఎంసీ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈసీ

Election Commission launched My GHMC app

  • జీహెచ్ఎంసీ ఎన్నికలకు సర్వం సిద్ధం
  • యాప్ ద్వారా ఓటరు స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
  • పోలింగ్ కేంద్రానికి దారి చూపించనున్న యాప్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నిన్నటితో ఎన్నికల ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడడంతో పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈసారి పెద్ద ఎత్తున ఓటరు చైతన్య కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పిన జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి లోకేశ్ కుమార్.. ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో ఓటరు స్లిప్‌లు అందుబాటులో ఉంచామని, ‘డౌన్‌లోడ్ యువర్ ఓటర్ స్లిప్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, పేరు, వార్డు నంబరు నమోదు చేయడం ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందనే విషయాన్ని కూడా గూగుల్ మ్యాప్ చూపిస్తుందని చెప్పారు.

కాగా, ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు స్వయం సహాయక బృందాల మహిళల ద్వారా ఓటరు చైతన్య కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు లోకేశ్ కుమార్ వివరించారు. అలాగే, సర్కిళ్ల స్థాయిలో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో సమావేశాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

Hyderabad
GHMC Elections
State Election Commission
Lokesh Kumar
My GHMC
  • Loading...

More Telugu News