టీమిండియా-ఆసీస్ మ్యాచ్ లో అందరి దృష్టి ఆకర్షించిన ప్రేమ జంట!

29-11-2020 Sun 22:04
  • సిడ్నీలో నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్
  • విజయం సాధించిన ఆతిథ్య జట్టు
  • గ్యాలరీలో తన ప్రియురాలికి ప్రపోజ్ చేసిన టీమిండియా అభిమాని
  • సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
Young couple attracted all in Sydney Cricket Ground

ఇవాళ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించడమే కాదు సిరీస్ కూడా చేజిక్కించుకుంది. అయితే నెట్టింట ఈ మ్యాచ్ ఫలితం కంటే కూడా ఓ ఘటన బాగా వైరల్ అవుతోంది. ఓవైపు మ్యాచ్ జరుగుతుండగా, ప్రేక్షకుల్లో ఓ యువ జంట అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ టీమిండియా ఫ్యాన్ తన ఆస్ట్రేలియన్ గాళ్ ఫ్రెండ్ కు ఎంతో హృద్యంగా ప్రపోజ్ చేశాడు. ఆమె "యెస్" అనడంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. తన ప్రియురాలిని సంతోషంగా హత్తుకుని సంబరాల్లో మునిగితేలాడు.

మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ సన్నివేశాన్ని మైదానంలోని భారీ తెరపై చూపించడంతో ఆటగాళ్లు సైతం ఎంజాయ్ చేశారు. ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ చప్పట్లు కొట్టి ఆ ప్రేమజంటను అభినందించారు. సాధారణంగా సోషల్ మీడియాలో మ్యాచ్ కు సంబంధించిన అంశాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకు భిన్నంగా ప్రేక్షకుల గ్యాలరీలో జరిగిన ఈ ఘటన అత్యధికంగా దర్శనమిస్తోంది.