ఏపీ కరోనా అప్ డేట్: రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,397 మాత్రమే!

29-11-2020 Sun 17:46
  • కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్
  • గత 24 గంటల్లో 54,710 కరోనా టెస్టులు
  • 620 మందికి పాజిటివ్
Huge recovery in Andhra Pradesh from corona pandemic

ఏపీలో కరోనా పరిస్థితులు చక్కబడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. కొన్ని నెలల కిందట లక్షల సంఖ్యలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు పది వేల లోపుకు దిగొచ్చింది. ప్రస్తుతం ఏపీలో 8,397 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని తాజా బులెటిన్ లో వెల్లడించారు.

గత 24 గంటల్లో 54,710 కరోనా పరీక్షలు నిర్వహించగా 620 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 107 కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో 15 చొప్పున కొత్త కేసులు వచ్చాయి.

అదే సమయంలో 3,787 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,67,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,52,298 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఏపీలో మరణాల సంఖ్య 6,988కి చేరింది.