పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ అజాంపై యువతి సంచలన ఆరోపణలు

29-11-2020 Sun 16:19
  • అన్ని ఫార్మాట్లలో పాక్ కెప్టెన్ గా బాబర్ అజాం
  • పెళ్లి పేరిట మోసం చేశాడన్న మహిళ
  • బాబర్ కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని వెల్లడి
Woman makes severe allegations over Pakistan national cricket team captain Babar Azam

అన్ని ఫార్మాట్లలోనూ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా నియమితుడైన బాబర్ అజాం చిక్కుల్లో పడ్డాడు. బాబర్ అజాం తనను పెళ్లి పేరిట మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. తాను, బాబర్ అజాం కలిసి చదువుకున్నామని, తనను పెళ్లి చేసుకుంటానని మొదట బాబరే ప్రతిపాదించాడని ఆమె వెల్లడించింది. 2011లో రిజిస్టర్ మ్యారేజి చేసుకునేందుకు తాము ఇంటి నుంచి వెళ్లిపోయామని తెలిపింది.

బాబర్ కెరీర్ తొలినాళ్లలో అతనికి తాను ఆర్థిక సాయం చేశానని, అతని ఎదుగుదల కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశానని వివరించింది. అయితే, పాక్ జట్టుకు ఎంపికైన తర్వాత బాబర్ అజాం పూర్తిగా మారిపోయాడని, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి గర్భవతిని చేశాడని ఆరోపించింది. గర్భవతినని కూడా చూడకుండా తనను కొట్టాడని ఆరోపించింది. తనపై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాడని వెల్లడించింది.