బండి సంజయ్, రాజాసింగ్‌తో కలిసి.. భాగ్మలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు

29-11-2020 Sun 12:44
  • భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు భారీగా వచ్చిన బీజేపీ శ్రేణులు 
  • వారాసిగూడకు బయలుదేరిన షా
  • రోడ్ షోలో పాల్గొననున్న అమిత్ షా
amit shah performs pooja at bagya lakshmi temple

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి హైదరాబాద్‌కు వచ్చిన బీజేపీ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లారు. పలువురు బీజేపీ నేతలతో కలిసి ఆయన అక్కడ పూజలు చేశారు. ఆయన వెంట ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉన్నారు.

భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్న అనంతరం అక్కడి నుంచి వారాసిగూడకు బయలుదేరారు. చార్మినార్‌లో ఆయన పర్యటన నేపథ్యంలో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరఫున గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.