మచిలీపట్నంలో కలకలం.. మంత్రి పేర్ని నానిపై దాడికి యత్నం

29-11-2020 Sun 12:19
  • తాపీతో దాడికి యత్నించిన వ్యక్తి
  • పేర్నినాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా దాడికి యత్నం
  • నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన అనుచరులు
ruckus at perni nani home

మచిలీపట్నంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించి కలకలం రేపాడు. పేర్ని నాని ఇంటి వద్ద ఆయనపై నిందితుడు తాపీతో దాడికి యత్నించాడు. పేర్నినాని ఇంటి నుంచి బయటకు వస్తుండగా దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో అతడిని పట్టుకున్న పేర్ని నాని అనుచరులు అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడు మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.