Road Accident: అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

road accident in usa

  • అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం
  • నారాయణపేట జిల్లాకు చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి మృతి
  • వారి కుమారుడు భరత్ కూడా మృతి
  • కూతురు మౌనికకు తీవ్రగాయాలు

అమెరికాలోని టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుని ముగ్గురు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి, లక్ష్మి దంపతుల పిల్లలు మౌనిక, భరత్ ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు.

4 నెలల క్రితం నరసింహారెడ్డి, లక్ష్మి టెక్సాస్‌లోని తమ కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో వారు నలుగురు పాల్గొని, తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నరసింహా, లక్ష్మితో పాటు కుమారుడు భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. కూతురు మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసింహారెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1 లో విధులు నిర్వహించేవాడు.


Road Accident
Telangana
narayanapet
  • Loading...

More Telugu News