పాతబస్తీలో హిందువులు భయంతో బతుకుతున్నారు: బండి సంజయ్ వ్యాఖ్యలు

29-11-2020 Sun 11:05
  • పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర
  • రోహింగ్యాలు, పాకిస్థానీలను వెళ్లగొడతాం
  • పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగడంలేదు
fear in pathabasti says b sanjay

గ్రేటర్ హైదరాబాద్‌ నగర పాలక ఎన్నికల్లో దూకుడుగా ప్రచారంలో పాల్గొంటోన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌లోని పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని, అక్కడ హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని ఆరోపించారు.

గ్రేటర్ ఎన్నికల్లో తాము గెలిస్తే పాతబస్తీ నుంచి రోహింగ్యాలు, పాకిస్థానీలను వెళ్లగొడతామని తెలిపారు. పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగడంలేదని ఆయన నిలదీశారు. అక్కడ  ఏడాదికి దాదాపు రూ.600 కోట్లు విద్యుత్‌ బిల్లులు, ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించడం లేదని అన్నారు.  పాతబస్తీని తమ పార్టీ భాగ్యనగరంగా మార్చాలని కోరుకుంటోందని చెప్పారు. గ్రేటర్‌ మైదరాబాద్ లో తమ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నో మహానగరాలను అభివృద్ధి చేసిన బీజేపీ, హైదరాబాద్‌ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తుందని చెప్పారు.