Devendra Fadnavis: మీపై వ్యక్తిగత విమర్శలు, దాడులు చేయాల్సిన అవసరం మాకు లేదు: ఉద్ధవ్ కు ఫడ్నవీస్ కౌంటర్

Fadnavis comments on Uddhav Thackeray

  • తమ కుటుంబాన్ని బీజేపీ బెదిరిస్తోందన్న ఉద్ధవ్ 
  • కంగన, అర్నాబ్ ల అభిప్రాయాలతో మేము ఏకీభవించలేదు
  • మహా ప్రభుత్వ తీరును కోర్టులు కూడా తప్పుబట్టాయి

తమ కుటుంబాన్ని, తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ బెదిరిస్తోందన్న మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మండిపడ్డారు. వారిపై వ్యక్తిగత విమర్శలు, దాడులు చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.

అర్నాబ్ గోస్వామి, కంగన రనౌత్ ల అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని ఎప్పుడూ చెప్పలేదని... అయితే, వారి పట్ల మహా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మాత్రం తప్పుపడుతున్నామని అన్నారు. వీరి వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కోర్టులు కూడా తప్పుపట్టాయని చెప్పారు.

అంతకు ముందు థాకరే మాట్లాడుతూ బీజేపీపై నిప్పులు చెరిగారు. తమది చేతకాని ప్రభుత్వంగా భావించవద్దని హెచ్చరించారు. మీరేమీ నీతిమంతులు కాదని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని ఎలా సెట్ చేయాలో తమకు తెలుసని అన్నారు.

  • Loading...

More Telugu News