dharmapuri arvind: 20 రాష్ట్రాల్లో అధికారంలో వున్నాం.. ఏ రాష్ట్రంలోనైనా మత ఘర్షణలు జరిగాయా?: ఎంపీ అరవింద్

arvind slams trs

  • కల్వకుంట్ల కుటుంబం లెక్కలేనంత అవినీతి చేసింది
  • హైదరాబాద్‌లోని కరెంటు స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లు చుట్టారు
  • ఒక్కో స్తంభానికి రూ.26 వేలు కాంట్రాక్టర్లకు ఇచ్చారు

గ్రేటర్ హైదరాబాద్ మహానగర పాలక వర్గ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ... అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా  బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సీఎం కేసీఆర్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం లెక్కలేనంత అవినీతి చేసిందని, తెలంగాణలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందని అన్నారు. హైదరాబాద్‌లోని కరెంటు స్తంభాలకు ఎల్‌ఈడీ లైట్లు చుట్టారని, వాటిలో ఒక్కో స్తంభానికి రూ.26 వేలు కాంట్రాక్టర్లకు ఇచ్చారని విమర్శించారు.

ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మత ఘర్షణలు జరుగుతాయంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలపై కూడా ధర్మపురి అరవింద్ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తమ పార్టీ మత ఘర్షణలను ప్రోత్సహిస్తోందంటూ వారు చేస్తోన్న వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దేశంలో మొత్తం 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, ఏ రాష్ట్రంలోనైనా మత ఘర్షణలు జరిగాయా? అని ఆయన ప్రశ్నించారు. మరి భైంసా, కరీంనగర్‌లలో మతకలహాలు ఎందుకు జరిగాయని ఆయన నిలదీశారు.

dharmapuri arvind
TRS
Telangana
  • Loading...

More Telugu News