బాలీవుడ్ కి 'మిథునం'.. బాలు పోషించిన పాత్రలో అమితాబ్!
- ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన 'మిథునం'
- పాత్రలలో జీవించిన బాలు, లక్ష్మి జంట
- రీమేక్ హక్కులు తీసుకున్న ప్రముఖ సంస్థ
- అమితాబ్, రేఖ కలసి నటించే అవకాశం
రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలు ఎక్కడో విదేశాలలో వుంటారు. వయసు మీదపడి వృద్ధాప్యంలో ఈ జంట సొంత ఊరులో తమ శేషజీవితాన్ని ఆడుతూ పాడుతూ అనుభూతుల, అనుభవాల సమ్మేళనంగా ఎంత అందంగా గడిపారన్నది వెండితెరపై రమణీయంగా ఆవిష్కృతమైన తీరు ప్రేక్షకుల హృదయాలను గాఢంగా హత్తుకుంది. బాలు, లక్ష్మిల అభినయంకు ప్రేక్షకులు హ్యాట్సాప్ చెప్పారు.
ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుందట. హిందీలో దీనిని అమితాబ్ బచ్చన్, రేఖ జంటతో రీమేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఒకనాటి హిట్ కాంబినేషన్ అయిన ఈ జంట ఇందులో నటిస్తే కనుక అభిమానులకు ఇదొక అందమైన కానుక అవుతుందనే చెప్పచ్చు.