మోసపోయామని తెలిసినప్పుడు కలిగే బాధ అంతాఇంతా కాదు: రేణు దేశాయ్

27-11-2020 Fri 16:02
  • ప్రేమ విఫలమైతే కలిగే బాధ నాకు తెలుసు
  • ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సరికాదు
  • మన ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు
I know the pain of love failure says Renu Desai

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సినీ నటి రేణు దేశాయ్ మళ్లీ అభిమానుల ముందుకు వచ్చారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలిచ్చారు. ప్రేమ విఫలమడం గురించి ఆమె మాట్లాడూ, లవ్ ఫెయిల్ అయితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని చెప్పారు.

మనం ఎంతగానో ప్రేమించే వ్యక్తి మన పక్కన లేరనే విషయాన్ని తట్టుకోలేమని, మనం మోసపోయామని తెలిసినప్పుడు కలిగే బాధ అంతాఇంతా కాదని రేణు అన్నారు. అయితే ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదని చెప్పారు. మన జీవితం, మన ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదని అన్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సాయంతో ఆ బాధ నుంచి బయటపడొచ్చని చెప్పారు.