Ramesh Babu: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం కేసు: డాక్టర్ రమేశ్‌బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతి

  • మూడు రోజుల పాటు విచారణకు అనుమతి 
  • ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు విచారణ
  • ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే విచారించాలన్న హైకోర్టు
AP HC gives permission to investigate Dr Ramesh Babu

స్వర్ణ ప్యాలెస్ కరోనా సెంటర్ లో జరిగిన అగ్నిప్రమాదం కేసును ఈరోజు ఏపీ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా డాక్టర్ రమేశ్ కుమార్ ను విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు మూడు రోజుల పాటు విచారించాలని సూచించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపాలని తెలిపింది.

రమేశ్ హాస్పిటల్ అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై విజయవాడ గవర్నర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని రమేశ్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ పోతినేని రమేశ్ బాబు, ఛైర్మన్ సీతారామ్మోహన్ రావులు హైకోర్టులో పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు వారిపై తదుపరి చర్యలను నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే, విచారణకు అనుమతించాలంటూ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదనలు విన్న కోర్టు రమేశ్ కుమార్ ను విచారించేందుకు అనుమతించింది.

More Telugu News