Jagan: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

  • 2 గంటలకు పైగా కొనసాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం 
  • కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదం 
  • ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదముద్ర
  • రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల విలువ లెక్కింపు
  • ఆర్డినెన్స్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశానికి ఆమోదం  
ap cabinet takes vital decisions

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో సచివాలయంలో ఈ రోజు దాదాపు 2 గంటలకు పైగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కడప జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులో పరిశ్రమల ప్రోత్సాహకాలపై ఆమోదం తెలిపారు. అలాగే, కొప్పర్తి ఎలక్ట్రానిక్ పరిశ్రమల ప్రోత్సాహకాలకు ఆమోదముద్ర వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల విలువ లెక్కింపునకు సంబంధించి  ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశానికి ఆమోదం తెలిపారు.
 
అలాగే, నివర్ తుపాను ప్రభావంపై కేబినెట్ లో చర్చించామని మంత్రి కన్నబాబు మీడియాకు తెలిపారు. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలలో ఎక్కువ వర్షపాతం నమోదయిందని, 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. డిసెంబరు 30 లోపు పంట నష్టపరిహారాన్ని అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని చెప్పారు. పోలవరం ఎత్తును తగ్గించే ప్రసక్తే లేదని ఆయన వివరించారు. స్విల్ వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు.

More Telugu News