KTR: 'ప్రియమైన బీజేపీ మేనిఫెస్టో రచయితల్లారా..' అంటూ కేటీఆర్ సెటైర్లు

KTR satires on BJP Manifesto

  • బీజేపీ మేనిఫెస్టోపై కేటీఆర్ విసుర్లు
  • మేము చేసిన పనుల ఫొటోలను మీ మేనిఫెస్టోలో పెట్టుకోవడం సంతోషకరం
  • మేము చేసిన పనులకు దీన్నొక అభినందనగా భావిస్తున్నాం

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మేనిఫెస్టోలో కొత్తగా ఏమీ లేదని... పాత సీసాలో కొత్త సారాలా ఉందని విమర్శించారు. ఈరోజు బీజేపీ గ్రేటర్ మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో నగరవాసులను అలరించేలా ఎన్నో హామీలను ఇచ్చింది. ఈ మేనిఫెస్టోపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

'ప్రియమైన బీజేపీ మేనిఫెస్టో రచయితల్లారా... టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల ఫొటోలను జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలో పెట్టినందుకు సంతోషంగా ఉంది. మేము చేసిన పనులకు దీన్నొక అభినందనగా భావిస్తున్నాం' అని ట్వీట్ చేశారు. ఓ టీఆర్ఎస్ అభిమాని చేసిన ట్వీట్ ను షేర్ చేస్తూ ఆయన ఈ మేరకు స్పందించారు. 'కాపీ కొట్టడానికి కూడా తెలివి ఉండాలె' అంటూ వారు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటూ బీజేపీని దెప్పిపొడిచారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News