లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. 432 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్

26-11-2020 Thu 16:05
  • మెటల్, ఫార్మా షేర్ల అండతో లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • 129 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 5 శాతానికి పైగా పెరిగిన టాటా షేర్
Sensex closes with 432 points hike

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. మధ్యాహ్నం వరకు మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఆ తర్వాత లాభాల్లోకి మళ్లాయి. మెటల్, ఫార్మా షేర్ల అండతో లాభాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 432 పాయింట్లు లాభపడి 44,260కి చేరుకుంది. నిఫ్టీ 129 పాయింట్లు పెరిగి 12,987 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (5.16%), బజాజ్ ఫైనాన్స్ (2.95%), బజాజ్ ఆటో (2.60%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (2.20%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.16%).

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-0.87%), ఓఎన్జీసీ (-0.74%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.47%), టెక్ మహీంద్రా (-0.45%), ఇన్ఫోసిస్ (-0.23%).