క్రికెటర్ షమీ భార్యను వేధిస్తున్న 25 ఏళ్ల వ్యక్తి అరెస్ట్

26-11-2020 Thu 14:17
  • షమీకి దూరంగా ఉన్న హసీన్ జహాన్
  • కొంత కాలంగా వేధిస్తున్న కోల్ కతాకు చెందిన వ్యక్తి
  • డబ్బులు ఇవ్వాలని డిమాండ్
Man who is threatening Shamis wife arrested

టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన భర్తకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన కూతురుతో కలిసి ఆమె వేరుగా ఉంటున్నారు. తాజాగా ఆమెకు ఒక వ్యక్తి నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. కోల్ కతాకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే బెదిరిస్తూ డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఈ వేధింపులపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ, డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని దుండగుడు బెదిరిస్తున్నాడని తెలిపారు. ఫోన్ చేసి తిట్టేవాడని, ఫోన్ ఎత్తకపోతే పదేపదే ఫోన్లు చేసేవాడని చెప్పారు. ఆ వేధింపులను భరించలేక ఆమె పోలీసులను ఆశ్రయించిందని అన్నారు. మంగళవారం రాత్రి అతన్ని అరెస్ట్ చేశామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.