Nithin: 'రంగ్ దే' కోసం దుబాయ్ కి నితిన్!

Nithin leaves for Dubai for his latest movie shoot

  • ఇటలీ వెళ్లొచ్చిన 'రాధే శ్యామ్' టీమ్ 
  • వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'రంగ్ దే'
  • నితిన్, కీర్తి సురేశ్ జంటపై షూటింగ్  

ఓపక్క కరోనా మహమ్మారి ఇంకా పీడిస్తున్నప్పటికీ, దాదాపు హీరోలంతా ధైర్యంగా తమ తమ షూటింగులను ప్రారంభించేశారు. చాలామంది హైదరాబాదులోనే షూటింగులు నిర్వహిస్తుంటే.. మరికొందరు అవుట్ డోర్ షూటింగులకు కూడా వెళుతున్నారు. ఇంకొందరు విదేశాలకు కూడా వెళ్లి ఏ ఆటంకం లేకుండా షూటింగులు చేస్తున్నారు. ఆమధ్య ప్రభాస్ అలాగే 'రాధే శ్యామ్' షూటింగును ఇటలీలో నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని వచ్చాడు.

ఇప్పుడు ఇదే కోవలో నితిన్ కూడా విదేశాలకు వెళుతున్నాడు. ఆమధ్య 'భీష్మ' సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్ తదుపరి చిత్రంగా 'రంగ్ దే' చేస్తున్న విషయం విదితమే. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మిగిలి వున్న కొంత షూటింగును ఇప్పుడు దుబాయ్ లో చేస్తున్నారు. అక్కడ నితిన్, కీర్తి సురేశ్ జంటపై కొన్ని సన్నివేశాలను, పాటలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు.

Nithin
Keerthi Suresh
Venky Atluri
  • Loading...

More Telugu News