Somireddy Chandra Mohan Reddy: ఇది రాజకీయం కాదు.. అరాచకీయం: అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత సోమిరెడ్డి ఆగ్రహం

somireddy slams akbaruddin

  • తెలుగు జాతి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, పీవీ 
  • అక్బరుద్దీన్ ఒవైసీ తీరు దుర్మార్గం 
  • సంకుచిత దృక్పథంతో చూడటం క్షమించరాని విషయం
  • ఇంత చౌకబారుగా వ్యవహరించడం పొరపాటు

పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేయడం పట్ల ఏపీ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలుగు జాతి ముద్దుబిడ్డలు ఎన్టీఆర్, పీవీ నరసింహరావు గార్ల ఘాట్లను కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనడం దుర్మార్గం. వీరు హిందువులు, ఆంధ్రులని కాదు.. జాతి నాయకులు.. భారతీయులమై ఈ మహానుభావులను సంకుచిత దృక్పథంతో చూడటం క్షమించరాని విషయం’ అని సోమిరెడ్డి మండిపడ్డారు.

‘వీరి విషయంలో ఇంత చౌకబారుగా వ్యవహరించడం పొరపాటు. ఇది రాజకీయం కాదు.. అరాచకీయం.. రేపు ఇంకొకరు వచ్చి మరొకరి సమాధులో, విగ్రహాలో కూల్చాలంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం? ఈ పోకడను తీవ్రంగా ఖండిస్తున్నాను.. వీరి విషయంలో మరోసారి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని సోమిరెడ్డి హెచ్చరించారు.

Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Andhra Pradesh
MIM
Akbaruddin Owaisi
  • Loading...

More Telugu News