Donald Trump: మైఖేల్ ఫ్లిన్ కు క్షమాభిక్ష పెట్టిన డొనాల్డ్ ట్రంప్!

Trumkp Pardoned Michel Flynn

  • అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై విచారణ
  • 2017లో నేరాన్ని అంగీకరించిన మైఖేల్
  • ఇప్పుడు పూర్తి క్షమాభిక్ష పెడుతున్నట్టు ప్రకటించిన ట్రంప్

తన నాలుగేళ్ల పదవీ కాలంలో క్షమాభిక్షల విషయంలో ట్రంప్ అతి పెద్ద నిర్ణయాన్ని ప్రకటించారు. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై జరిగిన విచారణలో తన తప్పును అంగీకరించిన మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్ కు క్షమాభిక్ష పెడుతున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.

"జనరల్ మైఖేల్ ఫ్లిన్ ను పూర్తిగా క్షమించేస్తున్నా.ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. మీకు, మీ అద్భుతమైన కుటుంబానికి అభినందనలు మైఖేల్ ప్లిన్. నాకు తెలుసు. కృతజ్ఞతలతో నువ్విప్పుడు పార్టీ చేసుకుంటావని" అని అన్నారు.

కాగా, రష్యా దౌత్యాధికారితో జరిపిన సంభాషణలపై ఎఫ్బీఐ విచారించగా, 2017లోనే ఫ్లిన్ తన తప్పును అంగీకరించారు. అయితే, ఆయనకు ఇంకా శిక్ష ఖరారు కాలేదు. తన నేరాంగీకార పిటిషన్ ను ఉపసంహరించుకోవాలన్న ఆలోచనలో ఉన్న ఫ్లిన్, ప్రాసిక్యూటర్లు తన హక్కుల గురించి పట్టించుకోలేదని, బలవంతంగా నేరాన్ని అంగీకరించేలా చేశారని కూడా ఆరోపించారు.

కాగా, ట్రంప్ అధికారంలో ఉన్న కాలంలో ఆఫ్ఘన్ లో యుద్ధ నేరాలకు పాల్పడిన అమెరికన్ సైనికులకు, చట్ట విరుద్ధంగా దేశంలోకి విదేశీ పౌరులను అనుమతించారని ఆరోపణలను ఎదుర్కొన్న ఆరిజోనా పోలీసు అధికారి జోయ్ అర్పాయో తదితరులకూ ట్రంప్ క్షమాభిక్ష పెట్టారు.

Donald Trump
Pardon
Michel Flynn
  • Loading...

More Telugu News