Diago Maradona: నా హీరో ఇక లేరు: గంగూలీ భావోద్వేగ వ్యాఖ్యలు

Gangoly and Sachin RIP on Maradona

  • గుండెపోటుతో డీగో మారడోనా హఠాన్మరణం
  • మారడోనా కోసమే ఫుట్ బాల్ చూశానన్న గంగూలీ
  • ప్రపంచం గొప్ప ఆటగాడిని కోల్పోయిందన్న సచిన్

ఫుట్ బాల్ లెజండ్ డీగో మారడోనా హఠాన్మరణంపై భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాడు అర్జెంటీనాలో 60 ఏళ్ల వయసులో గుండెపోటుతో మారడోనా కన్నుమూసిన సంగతి తెలిసిందే.

"నా హీరో ఇక లేరు. ఆ అద్భుతమైన ఆటగాడి ఆత్మకు శాంతి కలగాలి. మీ కోసం మాత్రమే నేను ఫుట్ బాల్ చూశాను" అని ట్వీట్ చేశారు. ఈనెల ప్రారంభంలో బ్రెయిన్ సర్జరీ తరువాత కాస్తంత కోలుకున్నప్పటికీ, ఆపై పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.

మారడోనా మృతిపై సచిన్ టెండూల్కర్ సైతం స్పందించారు. "ఫుట్ బాల్ ప్రపంచం ఓ గొప్ప ఆటగాడిని కోల్పోయింది. డీగో మారడోనా ఆత్మకు శాంతి కలగాలి. మీరు మా మధ్య లేకపోవడం బాధాకరం" అని వ్యాఖ్యానించారు. ఈ వార్త తనను కలచి వేసిందని యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు.

Diago Maradona
Sourav Ganguly
Sachin Tendulkar
  • Error fetching data: Network response was not ok

More Telugu News