Talasani: తప్పదు... గతంలో చేసిన పాపాలను కడుక్కోవాల్సిందే: తలసాని కీలక కామెంట్లు

Talasani Comments on BJP and Congress
  • గతంలో కొన్ని ప్రభుత్వాల్లో భాగస్వామ్యం అయ్యాం
  • వారి తప్పుల్లోనూ పాలు పంచుకుని ఉండవచ్చు
  • తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
గతంలో కొన్ని ప్రభుత్వాల్లో తాము భాగస్వాములుగా ఉండి, వారు చేసిన తప్పుల్లో పాలు పంచుకుని ఉండవచ్చని, ఆ పాపాలను కడుక్కుంటామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, తాము హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్లమేనని అన్నారు. నగరాన్ని మూడు నాలుగు దశాబ్దాలు వెనక్కు నెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆయన, కాంగ్రెస్ మేనిఫెస్టో అసాధ్యమైన హామీలను చేసిందని, వీటిని ఎవరూ అమలు చేయలేరని అన్నారు.

గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని, ప్రజలకు ఎంతో సంక్షేమాన్ని దగ్గర చేశామని తలసాని వ్యాఖ్యానించారు. కరోనా నియంత్రణ కోసం ప్రస్తుతం మూసివున్న ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీని కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమైన విషయమని మండిపడ్డారు.
Talasani
Danam
Telangana

More Telugu News