ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు నేను రక్షణగా ఉంటా: బండి సంజయ్

25-11-2020 Wed 21:41
  • అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం
  • ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించాడని కూల్చుతావా అంటూ ఫైర్
  • రేపు ఎన్టీఆర్, పీవీ ఘాట్ల వద్ద ప్రమాణం చేస్తానని వెల్లడి
Bandi Sanjay says he will protect NTR and PV ghats

హైదరాబాదులోని ఎన్టీఆర్, పీవీ ఘాట్లను కూల్చేయాలంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి ఆవేశపూరితంగా స్పందించారు. ఎన్టీఆర్ కాషాయ వస్త్రాలు ధరించి పాలన చేశాడని ఎన్టీఆర్ ఘాట్ కూల్చుతావా? పీవీ అయోధ్య విషయంలో స్ఫూర్తిదాయక పాత్ర పోషించారని పీవీ ఘాట్ కూల్చుతావా? అంటూ మండిపడ్డారు. "రేపు ఉదయం ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు వెళ్లి ఆ మహనీయులకు నివాళులు అర్పిస్తాను. ఆ మహానాయకుల ఘాట్లకు నేను రక్షణగా ఉంటా అని రేపు ఘాట్ల వద్ద ప్రమాణం చేస్తా" అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.