ఒకరి బౌలింగ్ శైలిని మరొకరు అనుకరిస్తూ.... టీమిండియా క్రికెటర్ల సరదా వీడియో

25-11-2020 Wed 21:13
  • ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా
  • ఉల్లాసంగా ఆటగాళ్ల నెట్ ప్రాక్టీసు
  • సుదీర్ఘ పర్యటనకు సానుకూల సన్నద్ధత
Team India cricketers imitates one another bowling

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా క్రికెటర్లు ఎంతో ఉల్లాసంగా సాధనలో పాల్గొంటున్నారు. బయోబబుల్ లో ఉన్నా మైదానంలోకి వస్తే చాలు ఉత్సాహంగా కనిపిస్తూ రాబోయే సిరీస్ ల కోసం సన్నద్ధమవుతున్నారు. తాజాగా మైదానంలో నెట్ ప్రాక్టీసు సందర్భంగా టీమిండియా బౌలర్లు ఒకరి బౌలింగ్ శైలిని మరొకరు అనుకరిస్తూ సందడి చేశారు. బుమ్రా యాక్షన్ తో రవీంద్ర జడేజా బౌలింగ్ చేయగా, జడేజా యాక్షన్ తో బుమ్రా స్పిన్ వేశాడు.

మధ్యలో, ఓపెనర్ పృథ్వీ షా స్పిన్ దిగ్గజాలు మురళీధరన్, అనిల్ కుంబ్లేల బౌలింగ్ శైలిని అనుకరిస్తూ బంతులు విసిరి అలరించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. మొత్తమ్మీద భారత జట్టు సుదీర్ఘమైన ఆసీస్ పర్యటనకు సానుకూల దృక్పథంతో సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.