ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చేస్తామని ఒవైసీ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం: గోరంట్ల

25-11-2020 Wed 18:09
  • ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్
  • ఇలాంటి వ్యాఖ్యలు ఒవైసీకి తగవన్న గోరంట్ల
  • తీవ్రస్థాయిలో ఖండిస్తున్నానంటూ ట్వీట్
Gorantla responds to Akbaruddin Owaisi comments

అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని టీఆర్ఎస్ సర్కారు అంటోందని, అలాగైతే ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్, పీవీ నరసింహారావుల సమాధులను కూల్చివేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల తాలూకు ప్రకంపనలు ఏపీలోనూ వినిపిస్తున్నాయి. అక్బర్ వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు.

ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చివేస్తామనడం ఒవైసీకి తగదని హితవు పలికారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని పేర్కొన్నారు. ఎన్నికలను రాజకీయంగానే చూడాలి తప్ప, ఇష్టానుసారం మాట్లాడితే ప్రజస్వామ్యం హర్షించదని తెలిపారు. ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాను అంటూ గోరంట్ల ట్వీట్ చేశారు.