చంద్రబాబుతో తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సమావేశం

25-11-2020 Wed 17:51
  • త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికలు
  • తిరుపతి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి
  • ఉప ఎన్నిక వ్యూహంపై చంద్రబాబుతో చర్చ
TDP leader Panabaka Lakshmi met party chief Chandrababu

తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో టీడీపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పనబాక లక్ష్మి ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. ఉప ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై ఆమె చంద్రబాబుతో చర్చించారు. ఈ సమావేశంలో పనబాకతో పాటు ఆమె భర్త కృష్ణయ్య, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ఉప ఎన్నిక నేపథ్యంలో తిరుపతిలో టీడీపీ కార్యాలయాన్ని పనబాక దంపతులు శనివారం ప్రారంభించనున్నారు.