Sachin Tendulkar: కోహ్లీ లేకపోతే పెద్ద శూన్యత ఏర్పడుతుంది: సచిన్

  • టెస్టులకు కోహ్లీ దూరం కావడం పెద్ద లోటే
  • అయితే మరో ప్రతిభ గల ఆటగాడికి అవకాశం దక్కుతుంది
  • ఓపెనర్ గా మయాంక్ అగర్వాల్ వచ్చే అవకాశం ఉంది
Kohlis absence will be a big void for Team India says Sachin

టీమిండియా కెప్టెన్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్ లో తొలి మ్యాచ్ తర్వాత ఇండియాకు తిరిగిరానున్నాడు. అతని భార్య అనుష్క శర్మ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో, ఆ సమయంలో తన భార్య పక్కనే ఉండేందుకు కోహ్లీ స్వదేశానికి రానున్నాడు.

ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ... టెస్టు సిరీస్ కు కోహ్లీ దూరం కావడం టీమిండియాకు పెద్ద లోటేనని చెప్పాడు. జట్టులో శూన్యత ఏర్పడుతుందని అన్నాడు. అయితే మరో టాలెంటెడ్ ఆటగాడికి జట్టులో స్థానం లభిస్తుందని తెలిపాడు. ఆ ఆటగాడికి తనను తాను నిరూపించుకునేందుకు ఒక గొప్ప అవకాశం లభిస్తుందని చెప్పాడు.

టెస్ట్ సిరీస్ ఓపెనర్ గా మయాంక్ అగర్వాల్ వచ్చే అవకాశం ఉందని సచిన్ అభిప్రాయపడ్డాడు. అయితే అతనితో పాటు వచ్చే మరో ఓపెనర్ ఎవరనే విషయంలో మాత్రం స్పష్టత లేదని చెప్పాడు. కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, పృథ్వీషా లలో ఎవరో ఒకరు బరిలోకి దిగే అవకాశం ఉంది.

More Telugu News